మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Telangana - Sep 02, 2020 , 14:37:26

200 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

200 క్వింటాళ్ల  రేషన్ బియ్యం పట్టివేత

ఖమ్మం : పేద ప్రజలకు ప్రభుత్వం సబ్సిడీగా అందిస్తున్న రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిసిస్తున్న నిందితుడుని పోలీసులు పట్టుకున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన  ఏలూరి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ముదిగొండ మండలం బానపురం గ్రామం నుంచి కాకినాడకు అక్రమంగా తరలిస్తున్నారనే  విశ్వసనీయ సమాచారం మేరకు.. టాస్క్ ఫోర్స్ ఏసీపీ వెంకట్రావు ఆధ్వర్యంలో ఎస్ఐ ప్రసాద్ తన సిబ్బందితో నిఘా పెట్టి వెంకటగిరి క్రాస్ రోడ్డు వద్ద పట్టుకున్నారు.  (TS07 UA 1972) నెంబర్ గల లారీలో

సుమారు ఐదు లక్షల నలభై వేల రూపాయల విలువగల 200 క్వింటాల రేషన్ బియ్యాన్ని  ఎటువంటి పత్రాలు లేకుండా తరలిస్తునట్లు గుర్తించారు. బానపురం కు చెందిన ఎర్ర వీరబాబు (డ్రైవర్) సహకారంతో రవాణా చేస్తున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకొన్నారు. తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం ఖమ్మం రూరల్  పోలీసు స్టేషన్ అప్పగించినట్లు ఏసీపీ వెంకట్రావు  తెలిపారు.

ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ ఏసీపీ వెంకట్రావు  మాట్లాడుతూ..రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనిఖీల్లో కానిస్టేబుల్ సూర్యనారాయణ, కళింగ రెడ్డి, హమీద్, రామారావు, చెన్నారావు పాల్గొన్నారు.


logo