గురువారం 26 నవంబర్ 2020
Telangana - Nov 16, 2020 , 21:37:24

2.5 క్వింటాళ్ల బెల్లం పట్టివేత

2.5 క్వింటాళ్ల బెల్లం పట్టివేత

వరంగల్ రూరల్ :  అక్రమంగా ఆటోలో తరలిస్తున్న 260 క్వింటాళ్ల బెల్లాన్ని ఎక్సైజ్ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు సీజ్‌ చేశారు. ఇతర ప్రాంతాల నుంచి నర్సంపేట పట్టణానికి అక్రమంగా బెల్లం, పటిక తరలిస్తున్నట్లు ఎక్సైజ్ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులకు విశ్వసనీయ సమాచారం రావడంతో పట్టణంలో తనిఖీలు చేపట్టారు. వరంగల్‌ వైపు నుంచి వస్తున్న ఆటోలో బెల్లాన్ని గుర్తించి ఆటోను సీజ్‌ చేసి నర్సంపేట ఎక్సైజ్ స్టేషన్‌కు తరలించారు. సారా తయారీ ఓ వ్యక్తి వరంగల్ నుంచి నర్సంపేటకు బెల్లాన్ని తీసుకువస్తున్నట్లు విచారణలో గుర్తించారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.