గురువారం 22 అక్టోబర్ 2020
Telangana - Oct 04, 2020 , 03:03:13

శంషాబాద్‌లో 21 కిలోల ఆభరణాలు పట్టివేత

శంషాబాద్‌లో 21 కిలోల ఆభరణాలు పట్టివేత

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: సాధారణ పార్సిళ్లు అవి.. హైదరాబాద్‌ శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి ముంబైకి పంపిస్తున్నారు. డొమెస్టిక్‌ కార్గో వద్ద శనివారం కస్టమ్స్‌ అధికారులు ఎప్పటిలాగే స్క్రీనింగ్‌ నిర్వహిస్తున్నారు. పార్సిళ్లలో రూ.30 కోట్ల విలువైన వజ్రాలు, బంగారం, ఇతర ఆభరణాలు ఉండటాన్ని చూసి అధికారుల కళ్లు తిరిగిపోయాయి. గుట్టుచప్పుడుకాకుండా 21 కిలోల బంగారంతోపాటు ఇతర ఆభరణాలను కార్గోద్వారా ముంబైకి తరలించేందుకు యత్నిస్తున్నట్టు గుర్తించారు. ఈ పార్సిళ్లను ఎవరు తరలిస్తున్నారన్న దానిపై ఆరా తీస్తున్నట్టు సమాచారం. వాటిపై ఉన్న బిల్లుల ఆధారంగా వివరాలు సేకరిస్తున్నట్టు ఓ అధికారి తెలిపారు. పూర్తి వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు.


logo