మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 13, 2020 , 02:30:52

కారులో గంజాయి పట్టివేత

కారులో గంజాయి పట్టివేత

  • ఇద్దరి అరెస్టు.. మరో ఇద్దరు పరారీ

నకిరేకల్‌: ఏపీలోని విశాఖపట్నం జిల్లా అనకాపల్లి నుంచి ముంబైకి గంజాయి రవాణా చేస్తున్న ముఠాను నల్లగొండ జిల్లా నకిరేకల్‌ పోలీసులు పట్టుకొన్నారు. నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం నకిరేకల్‌ శివారులో సీఐ బాలగోపాల్‌ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేస్తున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న స్కార్పియో(ఎంహెచ్‌ 14 సీఎఫ్‌0171)ను ఆపగా.. డ్రైవర్‌ ఆపకుండా వెళ్లాడు. పోలీసులు వాహనాన్ని వెంబడించగా దుండగులు మండలంలోని చందంపల్లి స్టేజీ వద్ద వాహనాన్ని నిలిపి కారులోంచి ఇద్దరు పారిపోయారు. మరో ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. వాహనంలో  2 కిలోల బరువున్న 40 గంజాయి ప్యాకెట్లు లభ్యమయ్యాయి. మహారాష్ట్రకు చెందిన బాపుసాహెబ్‌ భాస్కర్‌ డాంగే, అంకిత్‌ అర్జున్‌చౌదరిని అరెస్ట్‌ చేసినట్లు డీఎస్పీ వివరించారు.  logo