మంగళవారం 02 మార్చి 2021
Telangana - Jan 22, 2021 , 18:36:07

అఖిలప్రియకు బెయిల్‌ మంజూరు

అఖిలప్రియకు బెయిల్‌ మంజూరు

హైదరాబాద్‌ : బోయినపల్లి కిడ్నాప్‌ కేసులో ఏ-1 నిందితురాలిగా ఉన్న ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు బెయిల్‌ మంజూరైంది. సికింద్రాబాద్‌ సెషన్స్ కోర్టు ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 15 రోజులకు ఒకసారి బోయిన్‌ పల్లి పోలీస్‌ స్టేషన్‌లో హాజరుకావాలని కోర్టు ఆమెకు సూచించింది. అఖిలప్రియ రేపు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.

కిడ్నాప్ కేసులో అరెస్టయిన భూమా అఖిలప్రియ గత 17 రోజులుగా  చంచల్ గూడ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉంటున్న విషయం తెలిసిందే. కాగా, ఇదే కేసులో ఏ-3 నిందితుడిగా ఉన్న ఆమె భర్త భార్గవ్‌రామ్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. ప్రవీణ్‌ రావు సోదరుల కిడ్నాప్‌ కేసు వెలుగులోకి వచ్చిన నాటి నుంచి భార్గవ్‌ రామ్‌ పరారీలో ఉంటున్న విషయం విదితమే. ఈ కేసులో మరో నిందితుడిగా ఉన్న భూమా అఖిలప్రియ సోదరుడు జగత్‌ విఖ్యాత్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై కోర్టులో సోమవారం విచారణ జరగనుంది.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo