న‌వంబ‌ర్ 1 నుంచి దుబ్బాక‌లో 144 సెక్ష‌న్

Oct 31, 2020 , 21:45:30

సిద్దిపేట : నవంబర్ 1వ తేదీ సాయంత్రం 6 గంట‌ల‌ నుండి నవంబర్ 4వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని అన్ని గ్రామాలలో సెక్షన్ 144 అమల్లో ఉంటుందని పోలీసు కమిషనర్ డి జోయెల్ డేవిస్ పేర్కొన్నారు. దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్‌ న‌వంబ‌ర్ 3వ తేదీన జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే. కావునా పైనా పేర్కొన్న రోజుల్లో ఐదుగురి కంటే ఎక్కువ మంది ఒకే చోట గుమిగూడడానికి అనుమతి లేద‌ని కమిషనర్ తెలిపారు. ఈ మూడు రోజులలో పార్టీ జెండాలు లేదా ప్లకార్డులు ప్ర‌ద‌ర్శించ‌వ‌ద్ద‌ని ప్రజలను కోరారు. స‌మావేశాలు, ధ‌ర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలు, ప‌టాకులు పేల్చ‌డాన్ని నిషేధించిన‌ట్లు వెల్ల‌డించారు. ఉల్లంఘించిన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లు పేర్కొన్నారు. 

తాజావార్తలు

ట్రెండింగ్

THE CONTENTS OF THIS SITE ARE © 2020 TELENGANA PUBLICATIONS PVT. LTD