
హైదరాబాద్: సైబర్ నేరాల దర్యాప్తుపై పోలీసులు మరింత దృష్టిసారించారు. గ్రామీణ పోలీస్స్టేషన్లలో సిబ్బంది సైతం సైబర్‌నేరాల పరిశోధనలో నైపుణ్యం సాధించేలా రాష్ట్రవ్యాప్తంగా 1,989 మందిని సైబర్ వారియర్స్‌గా ఎంపికచేసిన విషయం తెలిసిందే. వారికి గత నెలలో వారంపాటు సైబర్ నేరాలపై ప్రాథమిక అవగాహన కల్పించారు. దర్యాప్తులో అనుసరించాల్సిన కీలక అంశాలపై అవగాహన పెంచేలా గురువారం నుంచి రెండో దశ ఆన్లైన్ శిక్షణ ప్రారంభించబోతున్నారు.
నకిలీ మెసేజ్‌ల గుర్తింపు, వాటిని సృష్టించేవారిని తెలసుకోవడం.. అసలు ఎన్ని రకాలుగా ఫేక్ మెసేజ్‌లు వస్తున్నాయి.. సైబర్ నేరగాళ్లు వివిధ సంస్థల పేరిట నకిలీ మెసేజ్‌లు పంపి చేస్తున్న మోసాలు.. ఇలా అనేక అంశాల్లో శిక్షణ ఇవ్వనున్నట్టు అధికారులు తెలిపారు. తొలివిడత శిక్షణ కోసం సైబర్ అవేర్నెస్ సిరీస్1 పుస్తకాన్ని విడుదల చేశారు. సైబర్ నేరాల దర్యాప్తులో ఎస్వోపీ (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్)తో రూపొందించిన సైబర్ అవేర్నెస్ 2.0 పుస్తకాన్ని సైతం మే చివరి నాటికి సైబర్ వారియర్ సిబ్బందికి ఇవ్వనున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..