సంక్రాంతి కానుకగా రెండో విడుత గొర్రెల పంపిణీ : మంత్రి తలసాని

హైదరాబాద్ : సంక్రాంతి కానుకగా అర్హులైన గొల్ల, కురుమలకు రెండో విడుత గొర్రెల పంపిణీ చేపట్టనున్నట్లు పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. తొలి విడుత గొర్రెల యూనిట్ల కోసం డీడీలు కట్టిన 30 వేల మంది లబ్ధిదారులకు ఇంకా పంపిణీ చేయాల్సి ఉందని, సీఎం కేసీఆర్ ఆదేశాలకు మేరకు వెంటనే పంపిణీ పూర్తి చేస్తామని పేర్కొన్నారు.
తొలి విడుత 7.61 లక్షల గొర్రెలు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఇప్పటివరకు 76.93 లక్షల గొర్రెలను పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ నెల 16న నల్లగొండలో రెండో విడుత గొర్రెల పంపిణీ చేపట్టనున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడుత గొర్రెల పంపిణీకి రూ. 360 కోట్ల వ్యయం అవుతుందని తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా 2 కోట్ల గొర్రెల సంపద సృష్టించామని వివరించారు. గొల్ల, కురుమల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.