బుధవారం 20 జనవరి 2021
Telangana - Nov 25, 2020 , 21:23:16

ఆబ్కారీశాఖ కమిషనర్‌, ఉన్నతాధికారులతో ఎస్‌ఈసీ సమీక్ష

ఆబ్కారీశాఖ కమిషనర్‌, ఉన్నతాధికారులతో ఎస్‌ఈసీ సమీక్ష

హైదరాబాద్‌ : ఆబ్కారీశాఖ కమిషనర్‌, ఉన్నతాధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సి.పార్ధసారథి సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రేటర్‌ ఎన్నికల సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కమిషనర్‌ అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన ఈ భేటీలో పార్ధసారథి మాట్లాడుతూ.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా మద్యం తయారీ, రవాణా, నిల్వలు, మద్యం దుకాణాలు తెరిచిఉంచే సమయాలు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. అనధికార మద్యం దుకాణాలు వెంటనే మూసివేయాలన్నారు.

నల్లబెల్లం, అక్రమ మద్యం ఉత్పత్తికి వాడే ముడిసరుకును సీజ్‌ చేయాలన్నారు. మద్యం అక్రమ రవాణా అరికట్టేందుకు చెక్‌ పోస్టులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ నెల 29న సాయంత్రం 6 గంటల నుంచి పోలింగ్‌ ముగిసే వరకు మద్యం దుకాణాలను మూసి ఉంచాలన్నారు. అదేవిధంగా ఓట్ల లెక్కింపు రోజు జీహెచ్‌ఎంసీ పరిధిలో మద్యం దుకాణాలను మూసేయాలన్నారు. 


logo