సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 15, 2020 , 08:53:27

తప్పించుకున్న మావోయిస్టుల కోసం క్షుణ్ణంగా గాలింపు

తప్పించుకున్న మావోయిస్టుల కోసం క్షుణ్ణంగా గాలింపు

కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా:  తిర్యాని మండల అడవులలో రెండు రోజుల క్రితం గాలింపు చేపడుతున్న సమయంలో తృటిలో తప్పించుకున్న‌ మావోయిస్టుల ఆచూకీ కోసం పోలీసులు కూంబింగ్ నిర్వ‌హిస్తున్నారు. కూంబింగ్ లో ఉన్న పోలీసులు నిన్న రాత్రి తిర్యాని మండల ప‌రిధిలోని ఒక గ్రామంలో వెతుకుతుండగా.. ముగ్గురు మావోయిస్టులు పోలీసులను చూసి  వెంటనే తప్పించుకున్నారు.

పోలీసుల కండ్లు గప్పి త‌ప్పించుకు తిరుగుతున్న మావోయిస్టులను ప‌ట్టుకునేందుకు తిర్యాని మండల అడవులను  ప్రత్యేక పోలీసు బలగాలతో గాలింపు చేస్తూ  క్షుణ్ణంగా అణువణువునా జల్లెడ పడుతున్నట్లు కొమురం భీం జిల్లా ఇంచార్జి ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ తెలిపారు.

logo