శనివారం 19 సెప్టెంబర్ 2020
Telangana - Aug 23, 2020 , 20:14:52

చెరువులో సముద్రపు చేప..ఆసక్తిగా తిలకిస్తున్న జనం

చెరువులో సముద్రపు చేప..ఆసక్తిగా తిలకిస్తున్న జనం

ఖమ్మం : జాలరి వలలో చిక్కిన ఓ వింత చేప చూపరులను ఆకర్షిస్తున్నది. జిల్లాలోని కూసుమంచి మండలం నర్సింహులగూడెం గ్రామ సమీపంలోని చెరువులో ఆదివారం డేగల వీరయ్య అనే జాలరి చేపల వేటకు చెరువుకు వెళ్లాడు. చెరువులో వల వేయగా జాలరికి వింత ఆకారం చేప చిక్కింది. సముద్రంలో ఉండే చేప చెరువులో ఎలా వచ్చిందని జాలరి ఆశ్చర్యపోయాడు. ఈ విషయం కాస్తా స్థానికులకు తెలియడంతో వింతైన ఈ సముద్రపు చేపను చూడటానికి అధిక సంఖ్యలో తరలివచ్చారు.


logo