ఆదివారం 29 మార్చి 2020
Telangana - Mar 20, 2020 , 12:42:53

సిర్పూర్‌ మిల్లులో కార్మికులకు స్క్రీనింగ్‌ పరీక్షలు

సిర్పూర్‌ మిల్లులో కార్మికులకు స్క్రీనింగ్‌ పరీక్షలు

కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా : జిల్లాలోని కాగజ్‌నగర్‌లోని సిర్పూర్‌ పేపర్‌ మిల్లులో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా జేకే మిల్లు యాజమాన్యం ప్రత్యేక చర్యలు చేపట్టింది. కార్మికులందరికి ధర్మో స్క్రీనింగ్‌ పరీక్షల నిర్వహణ చేపట్టింది. అదేవిధంగా మిల్లు పరిసరాలను ఎస్పీఎం సిబ్బంది రసాయనాలతో శుభ్రం చేస్తుంది. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. ముందుస్తు జాగ్రత్త చర్యలను చేపడుతూ పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలను చేపడుతోంది. 

ఈ క్రమంలో జిల్లా యంత్రాంగం సైతం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో పటిష్ట ప్రణాళికలు, పక్కా వ్యూహంతో ముందుకెళ్తుంది. వైద్య సిబ్బందిని, ఇతర అధికారులను అప్రమత్తం చేసింది. కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా సూచనల మేరకు పల్లె పల్లెనా విస్తృత ప్రచారం నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్నది. నిన్న సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్పకూ డీఎంహెచ్‌వో పరీక్షలు చేసిన భయపడాల్సిన అవసరం లేదన్నారు. logo