సంక్రాంతి పండుగకు ప్రత్యేక రైళ్లు

హైదరాబాద్: సంక్రాంతి పండుగ నేపథ్యంలో దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడుపుతున్నది. పలు మార్గాల్లో నడుపనున్న రైళ్ల వివరాలను అధికారులు ప్రకటించారు. సికింద్రాబాద్-బెర్హంపూర్కు (07449) ఈ నెల 9నుంచి 16వ తేదీ వరకు, బెర్హంపూర్ నుంచి సికింద్రాబాద్కు (07450) ఈ నెల 10 నుంచి 17వ తేదీ వరకు క్లోన్ రైళ్లు నడుస్తాయి. హైదరాబాద్-విశాఖపట్నం (07451) ఈ నెల 9 నుంచి 16వ తేదీ వరకు, తిరుగుప్రయాణంలో ఇదే రైలు విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ 10 నుంచి 17వ తేదీ వరకు రాకపోకలు సాగిస్తాయి. సికింద్రాబాద్ నుంచి తిరుపతి (07453) ఈ నెల 12వ తేదీ ప్రత్యేక రైలు ఉంటుంది.
కాగా, రైల్వే మరమ్మతు పనుల కారణంగా పలు రైళ్ల రాకపోకల్లో మార్పులు చేయడంతో పాటు కొన్నింటిని రద్దు చేసినట్టు దక్షిణమధ్య రైల్వే అధికారులు చెప్పారు. విజయవాడ-హుబ్లీ (07225), హుబ్లీ-విజయవాడ (07226), హుబ్లీ-హైదరాబాద్ (073 19), హైదరాబాద్-హుబ్లీ (07320) మధ్య ప్రతి రోజు నడిచే రైళ్లను 20 నుంచి 29 తేదీల మధ్య రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
నాలుగు రైళ్లు మళ్లింపు: కేఎస్ఆర్ బెంగుళూరు సిటీ-అజ్మీర్(06205), అజ్మీర్-కేఎస్ఆర్ బెంగుళూరు(06206),జోధ్పూర్-కేఎస్ఆర్ బెంగుళూరు సిటీ(06533), కేఎస్ఆర్ బెంగుళూరు సిటీ-జోధ్పూర్(06534) మధ్య నడిచే రైళ్లను కూసుగలి బైపాస్, నావలూర్ స్టేషన్ల మీదుగా నడుపుతామని రైల్వే అధికారులు తెలిపారు.
తాజావార్తలు
- మరోసారి రుజువైన సింప్సన్ జోస్యం!
- 2,779 కరోనా కేసులు.. 50 మరణాలు
- అందుకే నో చెప్పిన సింగర్ సునీత
- బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎంపీ బడుగుల
- నెల రోజుల వ్యవధిలో రెండు సినిమాలతో రానున్న నితిన్..
- కన్వీనర్ కోటాలో ఆయుష్ పీజీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్
- ఏనుగుకు నిప్పు.. కాలిన గాయాలతో మృతి
- మార్కెటింగ్ శాఖలో 32 మంది ఉద్యోగులకు పదోన్నతి
- నలుగురు డైరెక్టర్లతో చిరు..ఫ్యాన్స్ కు క్లారిటీ
- 'కేజీఎఫ్ చాప్టర్ 2'కు యష్ పారితోషికం వింటే షాకే..!