సోమవారం 18 జనవరి 2021
Telangana - Dec 02, 2020 , 09:46:14

ఆగివున్న టిప్పర్‌ను ఢీకొట్టిన స్కూటీ.. జంట మృతి

ఆగివున్న టిప్పర్‌ను ఢీకొట్టిన స్కూటీ.. జంట మృతి

ఖమ్మం: జిల్లాలోని కామేపల్లిలో ఆగివున్న టిప్పర్‌ను ఓ స్కూటీ ఢీకొట్టడంతో ఇద్దరు మృతిచెందారు. కామేపల్లి మండలం పెద్దాపురం వద్ద రోడ్డుపై ఆగి ఉన్న టిప్పర్‌ను స్కూటీ వెనుకనుంచి ఢీకొట్టింది. దీంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకకు చెందిన కుసుమ రాజు, హైదరాబాద్‌కు చెందిన కర్రి మాలతి అక్కడిక్కడే మరణించారు. వీరు ఖమ్మం నుంచి ఇల్లందు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. కాగా, రోడ్డుపై ఆగివున్న టిప్పర్ కనిపించకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.