బుధవారం 12 ఆగస్టు 2020
Telangana - Jul 29, 2020 , 15:47:44

కోవిడ్‌-19 ఇత‌ర‌ ల‌క్ష‌ణాల‌ను సిద్ధం చేస్తున్న శాస్ర్త‌వేత్త‌లు

కోవిడ్‌-19 ఇత‌ర‌ ల‌క్ష‌ణాల‌ను సిద్ధం చేస్తున్న శాస్ర్త‌వేత్త‌లు

హైద‌రాబాద్ : కోవిడ్‌-19కు సంబంధించి వృద్ధి చెందిన ల‌క్ష‌ణాల‌ను సిద్ధం చేసే ప‌నిలో శాస్ర్త‌వేత్తులు ఉన్న‌ట్లు య‌శోద హాస్పిట‌ల్స్ సీనియ‌ర్ ఇంటర్వెన్షనల్ పల్మోనాలజిస్ట్ డాక్టర్ వై గోపి కృష్ణ తెలిపారు. సార్స్‌, కోవిడ్ అనే వైర‌స్ ప్రపంచవ్యాప్తంగా వినాశనం సృష్టించింది. వైర‌స్‌ మొద‌ట‌గా న్యుమోనియా, అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్(ఏఆర్‌డీఎస్‌) వంటి ఊపిరితిత్తుల‌కు సంబంధించిన వ్యాధులకు కారణమవుతుందని తెలిసినప్పటికీ తాజాగా ఈ వ్యాధి ఇతర ల‌క్ష‌ణాల‌ను గుర్తించార‌న్నారు. ఈ నేప‌థ్యంలో శాస్త్రవేత్తలు ఇప్పుడు కరోనా వైరస్ సంక్రమణ లక్షణాల జాబితాను నమోదు చేస్తున్నారన్నారు. 

స్ట్రోక్, రక్తం గడ్డకట్టడం, కవాసాకి డీసిజ్‌, బొటనవేలు దద్దుర్లు, సైలెంట్‌ హైపోక్సియా వంటి కొత్త‌, ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన ల‌క్ష‌ణాలను వ్యాధి ల‌క్ష‌ణాల్లో భాగంగా గుర్తించిన‌ట్లు తెలిపారు. కాగా ఈ ల‌క్ష‌ణాలు చాలా అరుదన్న ఆయ‌న సార్స్‌, కోవి-2 క‌రోనా వైర‌స్ వ‌ల్ల ఇవి నేరుగా సంభ‌విస్తాయో లేదో ఇంకా తెలియరాలేద‌న్నారు. ఈ క్రింద అంశాల ద్వారా వైరస్ వివిధ రకాల లక్షణాలు, దాని వ‌ల్ల జ‌రిగే నష్టాన్ని అర్థం చేసుకోవ‌చ్చ‌న్నారు. 

అసాధారణ లక్షణాలు..

* రక్త నాళాలకు ప్రత్యక్ష నష్టం, రక్తం గడ్డకట్టడానికి దారితీస్తుంది

* రోగనిరోధక వ్యవస్థను దెబ్బ‌తీయ‌డం లేదా అతిగా ప్ర‌తిస్పందించ‌డం

రక్త సంబంధిత మార్పులు..

* తెల్ల‌ర‌క్త‌క‌ణాలు, లింఫోసైట్లు తగ్గ‌డం

* ప్లేట్‌లెట్స్ తగ్గ‌డం 

* ర‌క్త‌నాళాల్లో ర‌క్తం గ‌డ్డ‌క‌ట్ట‌డం

గుండె సంబంధిత ఇబ్బందులు..

* గుండె కండ‌రాల‌కు న‌ష్టం వాటిల్ల‌డం 

* గుండె స‌క్ర‌మంగా కొట్టుకోక‌పోవ‌డం 

* ఆక‌స్మిక హార్ట్ స్ర్టోక్ 

* ఉన్న‌ట్టుండి ఒక్క‌సారిగా గుండె, ఊపిరితిత్తులు ఫెయిల్ కావ‌డం

మూత్రపిండాల వైఫ‌ల్యం..

* 10 శాతం మంది రోగుల్లో కిడ్ని స‌మ‌స్య‌ల‌ను గుర్తించారు

* మూత్రంలో ప్రోటీన్ కోల్పోవడం

* మూత్రంలో రక్తం కోల్పోవడం

* శరీరంలోని పొటాషియం, సోడియం లవణాల హెచ్చుత‌గ్గుల వ‌ల్ల బీపీ, హృదయ స్పందన రేటులో అవంత‌రాలు ఏర్ప‌డ‌టం

జీర్ణశయ స‌మ‌స్య‌లు.. 

* తీవ్రమైన వికారం

* ఆకలి లేక‌పోవ‌డం

* నీళ్ల విరేచ‌నాలు 

* కాలేయ న‌ష్టం, కొంత‌మందిలో తెల్ల కామెర్లు మ‌రికొంత మందిలో ప‌చ్చ‌ కామెర్లు

నాడీ వ్య‌వ‌స్థ వ్య‌క్తీక‌ర‌ణ‌లు..

* వాసన కోల్పోవడం

* తీవ్రమైన మైకం, త‌ల‌నొప్పి, కండ‌రాల నొప్పి, అలసట

చర్మ ల‌క్ష‌ణాలు.. 

* దద్దుర్లు ఏర్ప‌డ‌టం

* చికెన్ పాక్స్ 

* చర్మంపై నల్ల మచ్చలు

కోవిడ్ చికిత్స..

* ఆక్సిజన్

* స్టెరాయిడ్స్

* ప్లాస్మా థెరపీ

* యాంటీవైరల్స్ (రెమిడిసివిర్, ఫావిపిరవిర్)

* విటమిన్లు (విటమిన్ సి, విటమిన్ డి, జింక్)

* బ్ల‌డ్ తిన్న‌ర్స్‌( లో మాలుక్యుల‌ర్ వెయిట్ హెపారిన్‌)

* అరుదుగా యాంటీ ఇన్‌ఫ్ల‌మేట‌రీ డ్ర‌గ్స్  

క‌రోనా వైర‌స్ ఊపిరితిత్తులకు సంబంధించిన‌ సమస్యలను కలిగించడమే కాకుండా ప్రధాన అవయవ వ్యవస్థలను ప్రభావితం చేస్తుంద‌ని డాక్టర్ గోపి కృష్ణ  అన్నారు. సంబంధిత అవయవాలలో చిన్న గడ్డకట్టడం కూడా ఆ అవయవ వైఫల్యానికి దారితీసి మృత్యువాత‌కు గురైతున్న‌ట్లు చెప్పారు. ఏదేమైనా ఈ పరీక్షలు, మందులు, చికిత్సలు వ్యాధి తీవ్రతను తగ్గించేందుకు స‌హాయం చేస్తాయే త‌ప్ప వ్యాధి నివార‌ణ‌కు భ‌రోసా ఇవ్వ‌ద‌ని ఆయ‌న పేర్కొన్నారు.


logo