సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 07, 2020 , 03:11:56

స్కూల్‌ ఎన్‌వోసీకి 40 వేలు లంచం

స్కూల్‌ ఎన్‌వోసీకి 40 వేలు లంచం

  • పాఠశాల విద్యాకమిషనర్‌ కార్యాలయంలో ఇద్దరు అరెస్టు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఒక ప్రైవేటుస్కూల్‌ అఫిలియేషన్‌ కోసం నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌(ఎన్వోసీ)ఇచ్చేందుకు రూ.40 వేలు లంచం తీసుకుంటూ ఇద్దరు ఉద్యోగులు ఏసీబీకి చిక్కారు. ఈ ఘటన పాఠశాల విద్యాకమిషనర్‌ కార్యాలయంలో సోమవారం జరిగింది. ఏసీబీ అధికారుల వివరాల ప్రకారం.. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా నాగారంలోని శాంటామేరియా స్కూల్‌కు ఎన్వోసీ కోసం ఆ పాఠశాల ప్రతినిధి కే శ్రీనివాస్‌ దరఖాస్తు చేశారు. ఎన్వోసీ ఇచ్చేందుకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ కార్యాలయంలోని ప్లానింగ్‌ సూపరింటెండెంట్‌ రాచమల్ల లక్ష్మణ్‌కుమార్‌, జూనియర్‌అసిస్టెంట్‌ మనాజి విపిన్‌రాజ్‌ రూ.40 వేలు లంచం డిమాండ్‌చేశారు. ఈ విషయంపై బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. పక్కా పథకం ప్రకారం సోమవారం మధ్యాహ్నం లక్ష్మణ్‌కుమార్‌కు రూ.40 వేలు ఇస్తుండగా మాటువేసిన ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితులిద్దరిని అరెస్టుచేసి ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపర్చారు. కోర్టు వారికి 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించింది.logo