శనివారం 06 జూన్ 2020
Telangana - May 17, 2020 , 03:36:48

ఉపాధ్యాయులకు ఎస్‌సీఈఆర్టీ ఆన్‌లైన్‌ శిక్షణ

ఉపాధ్యాయులకు ఎస్‌సీఈఆర్టీ  ఆన్‌లైన్‌ శిక్షణ

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ సంస్థ ఉత్తర్వుల మేరకు ఎస్‌సీఈఆర్టీ, ఎన్‌సీఈఆర్టీ సంస్థలు సంయుక్తంగా ఆన్‌లైన్‌ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాయి. ‘కొవిడ్‌ -19 మానసిక సంసిద్ధత’పై నిర్వహిస్తున్న ఆన్‌లైన్‌ శిక్షణ తరగతులకు జిల్లాలలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, మండల విద్యాధికారులు హాజరుకావాలని అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 

ఈ నెల 18నుంచి 20 వరకు నిర్వహించనున్న ఆన్‌లైన్‌ శిక్షణ తరగతులకు ఎస్‌సీఈఆర్టీ యూట్యూబ్‌ చానల్‌ ద్వారా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు హాజరు కావాలని తెలిపారు. కోర్సు పూర్తయిన తర్వాత సర్టిఫికెట్లు అందిస్తారని పేర్కొన్నారు. ముందుగా నమోదు చేసుకున్న వారికి మాత్రమే సర్టిఫికెట్లు  అందజేస్తారని తెలిపారు. ఈ నెల 17వ తేదీలోపు తమ పేర్లను http://forms.gle/ SvJC48R wndnuuiyy7.  సైట్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు.


logo