బుధవారం 27 జనవరి 2021
Telangana - Jan 08, 2021 , 08:23:59

16లోపు ‘బల్దియా’ విజేతల పేర్లతో గెజిట్‌

16లోపు ‘బల్దియా’ విజేతల పేర్లతో గెజిట్‌

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థుల పేర్లతో ఈనెల 16వ తేదీలోపు గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) కసరత్తు చేస్తున్నది. గెలుపొందిన అభ్యర్థుల వివరాలివ్వాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను ఎస్‌ఈసీ ఇటీవల ఆదేశించింది. ఈ నోటిఫికేషన్‌ వచ్చిన నెలరోజుల్లోపు గెలుపొందిన కార్పొరేటర్లతో తొలి సమావేశం నిర్వహించి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం మేయర్‌, డిప్యూటీ మేయర్‌లను ఎన్నుకుంటారు. దీంతో పూర్తిస్థాయిలో నూతన పాలకవర్గం కొలువుతీరుతుంది.

అయితే మేయర్‌ ఎన్నికకు మ్యాజిక్‌ ఫిగర్‌తో సంబంధం లేదని జీహెచ్ఎంసీ ప్రకటించింది. ఎక్కువమంది సభ్యుల మద్దతున్న వారే మేయర్‌, డిప్యూటీ అవుతారని వెల్లడించింది. ప్రస్తుత పాలకమండలి గడువు వచ్చేనెల 10 వరకు ఉందని తెలిపింది.


logo