శనివారం 23 జనవరి 2021
Telangana - Jan 09, 2021 , 01:00:34

మార్చిలోగా 651 మందికి ఉద్యోగాలు

మార్చిలోగా 651 మందికి ఉద్యోగాలు

హైదరాబాద్‌, జనవరి 8 (నమస్తే తెలంగాణ): సింగరేణిలో ఏర్పడిన 651 ఉద్యోగ ఖాళీలను మార్చిలోగా భర్తీ చేస్తామని సంస్థ సీఎండీ ఎన్‌ శ్రీధర్‌ ప్రకటించారు. ఆ ఖాళీల వివరాలను శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు. ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన నియామక ప్రక్రియను మార్చి నాటికి పూర్తిచేస్తామని, అన్ని పోస్టులకు నిబంధనల ప్రకారం రాత పరీక్ష నిర్వహించి అర్హులైనవారిని ఎంపికచేస్తామని తెలిపారు. ఖాళీల్లో 569 పోస్టులు ఎన్సీడబ్ల్యూఏ పరిధిలోని కార్మిక ఉద్యోగాలని, మిగతా 82 అధికారుల పోస్టులని పేర్కొన్నారు. అధికారుల పోస్టులను ప్రత్యేక నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేస్తామని తెలిపారు.

పోస్టుల వివరాలు

సింగరేణిలో 569 పోస్టుల్లో జూనియర్‌ అసిస్టెంట్లు (క్లర్కులు)-177, ఫిట్టర్లు-128, ఎలక్ట్రీషియన్‌ ట్రైనీలు-51, వెల్డర్‌ ట్రైనీలు-54, టర్నర్‌/మెషినిస్ట్‌ ట్రైనీలు-22, మోటార్‌మెకానిక్‌ ట్రైనీలు-14, మౌల్డర్‌ ట్రైనీలు-19 ఉ న్నాయి. అలాగే సింగరేణి పరిధిలో ఉ న్న దవాఖానల్లో జూనియర్‌ స్టాఫ్‌న ర్స్‌-84, ల్యాబ్‌ టెక్నీషియన్లు-7, ఫా ర్మాసిస్టులు-5, ఎక్స్‌రే, ఈసీ జీ, విభాగాల్లో రెండేసి పోస్టులు, ఫిజియోథెరపీ, వెంటిలేటర్‌ విభాగాల్లో ఒక్కొక్క పోస్టు ను భర్తీ చేయనున్నారు. ఉన్నతస్థాయిలో భర్తీ చేయనున్న 82 పోస్టుల్లో.. మైనింగ్‌ విభాగంలో మేనేజ్‌మెంట్‌ ట్రైనీ-39, పర్సనల్‌ ఆఫీసర్‌ -17, మే నేజ్‌మెంట్‌ ట్రైనీ (ఇండస్ట్రియల్‌ ఇంజినీరింగ్‌)-10, సివిల్‌ విభాగంలో మేనేజ్‌మెంట్‌ ట్రైనీ-7, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ విభాగంలో మేనేజ్‌మెంట్‌ ట్రైనీ-6, జూనియర్‌ అటవీ అధికారి-3 పోస్టులు ఉన్నాయి. ఇవి కా కుం డా వివిధ గనులు, విభాగాలు, కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న 1436 పోస్టులను ఇంటర్నల్‌ అభ్యర్థులతో భర్తీ చేస్తామని శ్రీధర్‌ తెలిపారు. తెలంగాణ ఏర్పడ్డాక 13,934 ఉద్యోగాలు ఇచ్చామన్నారు. 


logo