గురువారం 04 జూన్ 2020
Telangana - Feb 10, 2020 , 01:00:17

విద్యతోనే దళితుల అభివృద్ధి

విద్యతోనే దళితుల అభివృద్ధి
  • ఏపీ పర్యటనలో ఎస్సీ, ఎస్టీ
  • కమిషన్‌ చైర్మన్‌ ఎర్రోళ్ల

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: దళితుల అభివృద్ధి విద్యతోనే సాధ్యమని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ అన్నారు. ఈ విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్నదని, సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో అధిక సంఖ్యలో గురుకుల విద్యాలయాలను ఏర్పాటుచేసి దళిత, గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారని పేర్కొన్నారు. ఆదివారం ఏపీలోని నెల్లూరు జిల్లా కావలిలో పర్యటించిన ఆయనను ఆ రాష్ట్ర ఎస్సీ సంక్షేమశాఖ అధికారులు, దళిత సంఘాల నాయకులు సత్కరించారు. కావలిలోని జవహర్‌ భారతి కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ఎర్రోళ్ల మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి సీఎం కేసీఆర్‌ అన్నివిధాలా కృషిచేస్తున్నారని చెప్పారు. ఈ పర్యటనలో ఎర్రోళ్ల వెంట కమిషన్‌ సభ్యుడు రాంబల్‌నాయక్‌ తదితరులు ఉన్నారు. logo