బుధవారం 03 జూన్ 2020
Telangana - May 04, 2020 , 00:52:29

భూనిర్వాసితులకు న్యాయం

భూనిర్వాసితులకు న్యాయం

  • ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ భరోసా

పెగడపల్లి: కాళేశ్వరం లింక్‌-2 కాలువ నిర్మాణంలో భూములు కోల్పోతున్న పెగడపల్లి, వెల్గటూర్‌ మండలాల రైతులకు న్యాయం చేస్తామని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ హామీ ఇచ్చారు. ఆదివారం జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం ఏడుమోటలపల్లి, రాంభద్రునిపల్లెకు చెందిన పలువురు భూ ని ర్వాసితులు సహకార సంఘం చైర్మన్‌ ఓరుగంటి రమణారావు, జెడ్పీటీసీ రాజేందర్‌రావు, ఎంపీపీ శోభసురేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో కరీంనగర్‌లో మంత్రి కొప్పులను కలిసి పలు సమస్యలు విన్నవించారు.


logo