మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Telangana - Aug 05, 2020 , 04:15:15

ఊరూరా పార్కుల ఏర్పాటే సీఎం సంకల్పం

ఊరూరా పార్కుల ఏర్పాటే సీఎం సంకల్పం

  • ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ 

ధర్మారం: ఊరూరా ఆహ్లాదకరమైన పార్కుల ఏర్పాటే సీఎం కేసీఆర్‌ సంకల్పమని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. ఇందుకోసం పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం, కానంపల్లి గ్రామాల్లో మంగళవారం జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా నంది రిజర్వాయర్‌ కట్ట దిగువన 10 ఎకరాల విస్తీర్ణం లో ఆకర్షణీయమైన మొక్కలు నాటి పల్లె ప్రకృతి వనం ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. పంచాయతీ పాలకవర్గం నంది రిజర్వాయర్‌ కట్టపై చెక్కిన సీఎం కేసీఆర్‌ పేరును మంత్రి కొప్పుల, మంత్రి ఈశ్వర్‌ పేరును జెడ్పీ చైర్మన్‌ ఆవిష్కరించారు. అనంతరం కానంపల్లి లో అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించి, పంచాయతీ భవనానికి శంకుస్థాపన చేశారు. గ్రామంలోని 30 మందికి మూడెకరాల చొప్పున భూపట్టాలు పంపిణీ చేశారు. 


logo