శుక్రవారం 05 జూన్ 2020
Telangana - Jan 20, 2020 , 02:02:33

వర్గీకరణపై కేంద్రంతో యుద్ధం!

వర్గీకరణపై కేంద్రంతో యుద్ధం!
  • ఫిబ్రవరి 8న సామూహిక ఆమరణ నిరాహారదీక్ష
  • మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు మాదిగల మద్దతు

తార్నాక: ఎస్సీ వర్గీకరణపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాదిగలను మోసం చేస్తున్నదని, ఇక ఉద్యమం ద్వారా కేంద్రంతో యుద్ధానికి మాదిగలు సిద్ధంకావాలని ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌, మాదిగ జేఏసీ కన్వీనర్‌ పిడమర్తి రవి పిలుపునిచ్చారు. ఆదివారం తార్నాకలోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ మాదిగలను ఓటుబ్యాంకుగా వాడుకొంటున్నదని, వర్గీకరణను పక్కన పెట్టేసి మోసం చేస్తున్నదని మండిపడ్డారు. కాంగ్రెస్‌ ఏనాడు మాదిగల పక్షాన నిలబడలేదని, వర్గీకరణపై నోరుమెదపకపోవడం వెనుక కుట్ర దాగి ఉన్నదని, బీజేపీ-కాంగ్రెస్‌ రెండూ మాదిగలకు వ్యతిరేకమేనని అన్నారు.రాష్ట్రవ్యాప్తంగా మాదిగలను ఏకంచేసి ఫిబ్రవరి 8న హైదరాబాద్‌లో సామూహిక ఆమరణ నిరాహారదీక్షను చేపట్టనున్నట్టు తెలిపారు. మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌  అభ్యర్థులకు మాదిగల సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. డాక్టర్‌ ఖాసింను విడుదలచేయాలని కోరారు. సమావేశంలో మాదిగ జేఏసీ నాయకులు ఇటుక రాజు, గాదె వెంకట్‌, వేల్పు ల వెంకటేశ్‌, తదితరులు పాల్గొన్నారు.


logo