సచివాలయంపై జోక్యం చేసుకోం

- ఎంపీ రేవంత్ పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు
- ఇప్పటికే ఒక పిటిషన్ కొట్టేశామని గుర్తుచేసిన ధర్మాసనం
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణలో పాత సచివాలయ భవనాల కూల్చివేత అంశంలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టంచేసింది. ఈ అంశంపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టాలని కోరుతూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి దాఖలుచేసిన పిటిషన్‌ను జస్టిస్ అశోక్‌భూషణ్, జస్టిస్ ఆర్ సుభాష్‌రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం బుధవారం కొట్టివేసింది. రేవంత్‌రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాదులు రాజ్ పంజ్వానీ, శ్రవణ్ కుమార్‌లు వాదనలు వినిపించారు. పాత సచివాలయం కూల్చివేతకు పర్యావరణ అనుమతి అవసరంలేదని కేంద్ర పర్యావరణశాఖ ఇచ్చిన లేఖకు చట్టబద్ధత లేదని పేర్కొన్నారు. దీని ఆధారంగానే తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించిందని చెప్పారు. ఈ విషయాన్ని హైకోర్టు ఎదుట ఎందుకు చెప్పలేదని ధర్మాసనం ప్రశ్నించింది. ఇప్పటికే ఇలాంటి పిటిషన్‌ను కొట్టివేశామని గుర్తుచేసింది. తాము హైకోర్టులో కేసు వేయలేదని, ఎన్జీటీలో వేశామని పిటిషనర్ తరఫు న్యాయవాదులు తెలిపారు. హైకోర్టు తీర్పు ప్రభావం ఎన్జీటీ తీర్పుపై ఉండకుండా ఆదేశాలివ్వాలని కోరారు. తెలంగాణ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, తెలంగాణ అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, న్యాయవాదులు పీ వెంకట్‌రెడ్డి, సాయికృష్ణ వాదనలు వినిపిస్తూ.. తెలంగాణ సచివాలయం కూల్చివేత ఇప్పటికే పూర్తయిందని, కేసును విచారించాల్సిన అవసరంలేదని పేర్కొన్నారు. కూల్చివేతలకు సంబంధించి అన్ని అనుమతులు తీసుకున్నామని, అన్ని ఆధారాలను హైకోర్టుకు సమర్పించామని తెలిపారు. ఇరువర్గాల వాదనలు నమోదు చేసుకొన్న ధర్మాసనం.. సుప్రీంకోర్టుకు వచ్చిన ప్రస్తుత పిటిషనర్ హైకోర్టు ఎదుట పిటిషనర్ కాదని తెలిపింది. ఈ మేరకు పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు ప్రకటించింది. అయితే హైకోర్టు తీర్పులోని న్యాయపరమైన అంశాలు ఓపెన్‌గానే ఉంటాయని, ఎన్జీటీ విచారణకు.. హైకోర్టు తీర్పుకు సంబంధం లేదని తెలిపింది.
తాజావార్తలు
- స్పెయిన్‌లో భారీ పేలుడు.. ఇద్దరు మృతి
- దీర్ఘకాలిక వీడ్కోలు కాదు.. తాత్కాలికమే : డోనాల్డ్ ట్రంప్
- బైడెన్ ప్రమాణ స్వీకారానికి ఒబామా, క్లింటన్, బుష్
- ట్రాఫిక్ నిర్వహణపై జీహెచ్ఎంసీ సమావేశం
- బైక్‌ను ఢీకొన్న లారీ.. దంపతుల సహా మరో మహిళ మృతి
- 18 నెలలపాటు వ్యవసాయ చట్టాల అమలు నిలిపివేత
- ‘క్రాక్’ సినిమాలో రవితేజ కొడుకుగా నటించిన బుడ్డోడెవరో తెలుసా..?
- ‘ది బీస్ట్’.. బైడెన్ ప్రయాణించే కారు విశేషాలు ఇవే..
- ‘ఓటిటి రిలీజ్‌పై స్రవంతి రవికిషోర్ సంచలన వ్యాఖ్యలు’
- సత్తా చాటితేనే సర్కారు కొలువు