సోమవారం 06 ఏప్రిల్ 2020
Telangana - Mar 22, 2020 , 10:24:48

ఎస్సీ యువతీ యువకులకు ఉచిత శిక్షణ

ఎస్సీ యువతీ యువకులకు ఉచిత శిక్షణ

హైదరాబాద్‌ : జిల్లా షెడ్యూల్డ్‌ కులాల సేవా సహకార అభివృద్ధి సంస్థ, సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్‌ డిజైనర్‌ హైదరాబాద్‌ సంయుక్త ఆధ్వర్యంలో అందించే ఉపాధికల్పన అవకాశం, ఉచిత శిక్షణను ఎస్సీ యువతీయువకులు సద్వినియోగం చేసుకోవాలని   ఎస్సీ కార్పొరేషన్‌ ఎగ్జిక్యుటివ్‌ డైరెక్టర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. టురాకోట్‌ హెల్త్‌ కేర్‌ సొల్యుషన్స్‌ ఆధ్వర్యంలో మార్కెట్‌ రీసెర్చ్‌ అనాలాసిస్ట్‌, క్లినికల్‌ రీసెర్చ్‌ అసోసియేట్‌ కోర్సుల్లో ఎంబీబీఎస్‌, యూడీఎస్‌, బీడీఎస్‌, ఎంఎస్సీ, బీఎస్సీ, లైఫ్‌ సైన్సెస్‌, పారామెడికల్‌, మెడికల్‌ గ్రాడ్యుయేట్‌, పోస్టు గ్రాడ్యుయేట్‌లో ఉత్తీర్ణులై 18 -35 సంవత్సరాల వయస్సు ఉన్న వారు ఎస్సీ కార్పొరేషన్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. 

సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్‌ డిజైన్‌ హైదరాబాద్‌ ఆధ్వర్యంలో అందించే టాబ్లెట్స్‌, మొబైల్‌ ఫోన్‌, ఎల్‌ఈడీ, ఎల్‌సీడీ, ప్లాస్మా టీవీ, హోం థియేటర్‌, ఎయిర్‌కండీషనర్‌, హోం అప్లయెన్సెస్‌, మాస్టర్‌ సర్టిఫికెట్‌, కోర్సు ఇన్‌ కంప్యూటర్‌ ఎయిడెడ్‌ టూల్‌ ఇంజినీరింగ్‌, మాస్టర్‌ సర్టిఫికెట్‌ కోర్స్‌ ఇన్‌ క్యాడ్‌లో ఉచిత శిక్షణకు ఐటీఐ, ఇంటర్మీడియెట్‌, ట్రేడ్‌లో డిప్లొమా, బీఎస్సీ, బీటెక్‌, డిప్లొమా, డిగ్రీ ఇన్‌ ఇంజినీరింగ్‌లో ఉత్తీర్ణులై 18-35 సంవత్సరాల వయస్సు కలిగిన వారు జిల్లా ఎస్సీ కార్పొరేషన్‌ కార్యాలయంలో ఈ నెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలని వివరించారు. గ్రామీణ ప్రాంతాల వారికి వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలలోపు, పట్టణ ప్రాంతాల వారికి రూ. 2 లక్షల లోపు ఉండాలని తెలిపారు. అభ్యర్థులు దరఖాస్తుతో పాటు కులం, ఆదాయం, నివాసం, ఆధార్‌ కార్డు జిరాక్స్‌ కాపీలను జతపరచి కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.


logo