గురువారం 04 జూన్ 2020
Telangana - May 15, 2020 , 10:38:21

ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ సభ్యులు దేవయ్య మృతి

ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ సభ్యులు దేవయ్య మృతి

హైదరాబాద్‌: తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ గౌరవ సభ్యులు దేవయ్య తెల్లవారుజామున 2 గంటల సమయంలో కన్నుమూశారు. ఆయన మృతికి పలువురి సంతాపం తెలిపారు. తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమీషన్‌ గౌరవ సభ్యులు సుంకపాక దేవయ్య  మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటని మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. ఆయన మృతిపట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ మాదిగ దండోరా, మాదిగల హక్కుల కోసం గలమెత్తి నాయకత్వం వహించిన దేవయ్య స్థానాన్ని ఎవరూ పూడ్చలేరని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. 

తెలంగాణ మాదిగ దండోరా వంటి సామాజిక ఉద్యమాలకు నాయకత్వం వహించిన దేవయ్య మరణం తీరని లోటని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ తెలిపారు. ఆయన అకాల మృతికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుండిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. 


logo