బుధవారం 03 జూన్ 2020
Telangana - Apr 02, 2020 , 23:31:35

‘గాంధీ’లో పటిష్ట బందోబస్తు

‘గాంధీ’లో పటిష్ట బందోబస్తు

  • ప్రతి ఫ్లోర్‌కు ఎస్సై, ఏసీపీ స్థాయి అధికారి ఇన్‌చార్జి : నార్త్‌జోన్‌ డీసీపీ కల్మేశ్వర్‌ వెల్లడి

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : గాంధీ దవాఖానలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. బుధవారం రాత్రి వైద్య బృందంపై దాడి నేపథ్యంలో నార్త్‌జోన్‌ డీసీపీ కల్మేశ్వర్‌ గురువారం గాంధీ దవాఖానను సందర్శించారు. ఎక్కడెక్కడ బందోబస్తు చర్యలు చేపట్టాలని వైద్య బృందాన్ని అడిగి.. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకున్నారు. ప్రతి ఫ్లోర్‌కు ఎస్సై స్థాయి అధికారి, నాలుగు ఫ్లోర్లకు ఒక ఇన్‌స్పెక్టర్‌ ఇన్‌చార్జిగా, దవాఖాన భవనానికి ఏసీపీ స్థాయి అధికారిని ఇన్‌చార్జిగా నియమించారు. దవాఖానలోకి వచ్చే రోగుల రిసెప్షన్‌ వద్ద ఇన్‌స్పెక్టర్‌ స్థాయి అధికారి బందోబస్తులో ఉంటారు. ఈ అధికారుల కింద హెడ్‌ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు ఉంటారు. బయట మూడంచెలతో భద్రతను ఏర్పాటు చేశారు. ఇందులో స్పెషల్‌ పోలీస్‌, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు కూడా ఉంటారు. పూర్తిస్థాయి బందోబస్తును అదనపు డీసీపీ  పర్యవేక్షిస్తుంటారని డీసీపీ కల్మేశ్వర్‌ తెలిపారు. మొత్తం గాంధీ దవాఖాన ఆవరణలో 200 మందికిపైగా పోలీసులు బందోబస్తులో ఉంటారని వివరించారు.


logo