మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 06, 2020 , 15:51:12

ఇంట్లోనే మాస్క్‌లు తయారు చేసుకోండిలా..ఉపాసన వీడియో

ఇంట్లోనే మాస్క్‌లు తయారు చేసుకోండిలా..ఉపాసన వీడియో

హైదరాబాద్‌: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌(కోవిడ్‌-19) ఇతరులకు సోకకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తెలంగాణ  ప్రభుత్వం ప్రచార కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్తగా మాస్కులను రక్షణగా వాడుతున్నారు. జ్వరం ఉంటే తప్ప..మాస్కులు అక్కర్లేదని, ఎవరూ కంగారు పడొద్దని వైద్యులు చెబుతున్నా అందరూ మాస్క్‌లు కొనుగోలు చేస్తున్నారు. దీంతో మాస్క్‌ల కొరతతో  ధరలు కూడా పెరిగిపోయాయి.  

కొన్ని చోట్ల మాస్క్‌లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతుండటంతో సినీ హీరో రామ్‌ చరణ్‌ సతీమణి ఉపాసన కొణిదెల సోషల్ మీడియా ద్వారా ప్రజలను చైతన్య పరుస్తున్నారు. తాజాగా ఇంట్లోనే మాస్క్‌లు ఎలా తయారు చేసుకోవాలో వివరించారు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, వృద్ధుల కోసం మాస్క్‌లను అందుబాటులో ఉంచుదామని అనవసరంగా వాటిని కొనుగోలు చేసి వృథా చేయొద్దని పిలుపునిచ్చారు. కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, శుభ్రత పాటించడం లాంటి విషయాలపై అవగాహన కల్పిస్తూ.. మాస్క్‌లు ఎలా తయారు చేసుకోవాలనే దానిపై వీడియోలో వివరించారు. 

ఇంట్లో అందుబాటులో ఉన్న టిష్యూ పేపర్‌తోనే మాస్క్‌ తయారు చేసుకోవచ్చు. ఒక టిష్యూ, రెండు  రబ్బర్లు, నాలుగు పిన్నుల  సాయంతో మనకు నచ్చిన సైజ్‌లో మాస్క్‌  రూపొందించుకోవచ్చు.
logo
>>>>>>