శనివారం 08 ఆగస్టు 2020
Telangana - Jul 24, 2020 , 12:42:10

కార్య‌ద‌క్షుడు కేటీఆర్ : మ‌ంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్‌

కార్య‌ద‌క్షుడు కేటీఆర్ : మ‌ంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్‌

మ‌హ‌బూబాబాద్ : తెలంగాణ ఉద్యమంలో కదం తొక్కి, బంగారు తెలంగాణ నిర్మాణ రథమెక్కి.. దేశం హర్షించే నేతగా, రాష్ట్రం మెచ్చిన నాయకునిగా జన నీరాజనాలు అందుకుని.. తండ్రికి తగిన తనయునిగా, టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వహణ అధ్యక్షునిగా, ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖామాత్యులుగా రాణించి తెలంగాణ యువతకు ఐకన్ గా, పార్టీ నేతలకు మార్గదర్శకులుగా, తెలంగాణ ప్రజల ముద్దుబిడ్డగా ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న కల్వకుంట్ల తారక రామునికి రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 

ఈ సంద‌ర్భంగా స‌త్య‌వ‌తి రాథోడ్ స్పందిస్తూ... ఐటీ శాఖామాత్యులుగా తెలంగాణ రాష్ట్రాన్ని ఐటీ ఎగుమతుల్లో నెంబర్ వన్ చేశారు. పరిశ్రమల శాఖామాత్యులుగా టీఎస్ ఐపాస్ తీసుకొచ్చి ప్రపంచంలోనే ఉత్తమమైన ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొచ్చారు. పురపాలక శాఖామాత్యులుగా మున్సిపాలిటీలను, కార్పోరేషన్లను అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులుగా దేశంలోనే అత్యధిక పార్టీ కార్యకర్తలు కలిగిన తిరుగులేని శక్తిగా టిఆర్ఎస్ ను మలిచారు. 

నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ అందరికీ తలలో నాలుకల కొనసాగుతున్న ఆయ‌న పది కాలాలపాటు ఆరోగ్యంగా ఉంటూ మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.  ప్రభుత్వంలో సహచర మంత్రిగా నిత్యం బంగారు తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయనకు అండగా ఉంటూ ప్రజ సంక్షేమానికి పాటుపడడం గొప్ప అవకాశమన్నారు.


logo