ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Telangana - Aug 31, 2020 , 01:57:29

13.27 లక్షల టెస్టులు

13.27 లక్షల టెస్టులు

  • శనివారం 61 వేల కరోనా పరీక్షలు
  • ఒక్కరోజే 2,924 మందికి పాజిటివ్‌
  • 1,638 మంది డిశ్చార్జి, 10 మంది మృతి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలు శరవేగంగా సాగుతున్నాయి. శనివారం 61 వేల మందికి పరీక్షలు చేయగా, 2,924 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 13.27 లక్షల పరీక్షలు పూర్తయినట్టు వైద్యారోగ్యశాఖ ఆదివారం విడుదలచేసిన బులెటిన్‌లో పేర్కొన్నది. ఇప్పటివరకు 1,23,090 మందికి వైరస్‌ సోకగా, ఇందులో 90,988 మంది కోలుకున్నారు. మరో 31,284 మంది హోంఐసొలేషన్‌లో, దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. దేశవ్యాప్తంగా మరణాల రేటు 1.79 శాతంగా ఉంటే, తెలంగాణలో 0.66 శాతంగా ఉన్నది. శనివారం నమోదైన 2,924 కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 461 మంది బాధితులున్నారు. రంగారెడ్డి జిల్లాలో 213, ఖమ్మంలో 181, కరీంనగర్‌లో 172, నల్లగొండలో 171, మేడ్చల్‌ మల్కాజిగిరిలో 153, నిజామాబాద్‌లో 140, సూర్యాపేటలో 118, వరంగల్‌ అర్బన్‌లో 102, సిద్దిపేటలో 97, జగిత్యాలలో 92, మంచిర్యాలలో 91 కేసులు రికార్డయ్యా యి. 1,638 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. కరోనాకు తోడు ఇతర దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా 10 మంది మృతిచెందారు.

రాష్ట్రంలో కరోనా కేసుల వివరాలు


వివరాలు
శనివారం
మొత్తం
పాజిటివ్‌ కేసులు
2,924
1,23,090
డిశ్చార్జి
1,638
90,988
మరణాలు
10818
చికిత్సలో  ఉన్నది
-31,284


logo