శుక్రవారం 27 నవంబర్ 2020
Telangana - Nov 09, 2020 , 18:50:53

సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను సాధించాలి : మంత్రి శ్రీనివాస్‌ గౌడ్

సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను సాధించాలి : మంత్రి శ్రీనివాస్‌ గౌడ్

యాదాద్రి భువనగిరి : బహుజనులకు రాజ్యాధికారం కల్పించిన మహా నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లాలోని భువనగిరి మండలం తాజ్ పూర్ గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్  విగ్రహాన్ని  ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..పాపన్న ఆశయాల సాధనకు బహుజనులంతా ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు.

ప్రతి గ్రామంలో బహుజనుల అంతా ఒక్కటై రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలన్నారు నిమ్న జాతుల ఏకం చేస్తూ దండు కట్టి ముందుకు నడిచిన ఉద్యమ కెరటం పాపన్నగౌడ్ అని కొనియాడారు. పాపన్న గౌడ్ చరిత్ర రాబోయే తరాలకు స్ఫూర్తి దాయకంగా నిలుస్తుందన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనాదక్షతతో ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు.