మంగళవారం 02 మార్చి 2021
Telangana - Jan 17, 2021 , 21:58:29

రేపు అంగన్‌వాడీ సిబ్బందికి చీరెలు పంపిణీ

రేపు అంగన్‌వాడీ సిబ్బందికి చీరెలు పంపిణీ

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ జిల్లా ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలో పనిచేసే అంగన్‌వాడీ టీచర్లు, సిబ్బందికి సోమవారం రాష్ట్ర గిరి, మహిళా శిశుసంక్షేమశాఖల మంత్రి సత్యవతి రాథోడ్‌ సోమవారం చీరెలు పంపిణీ చేయనున్నారు. ఉదయం 10 గంటలకు అమీర్‌పేటలోని వెంగళ్‌రావు నగర్‌ మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ కమిషనర్‌ కార్యాలయ ఆవరణలో ఈ కార్యక్రమం జరగనుంది. కార్యక్రమానికి మంత్రి సత్యవతి రాథోడ్‌తోపాటు హోంమంత్రి మహమూద్‌ అలీ, పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. జిల్లాలోని ఐసీడీఎస్‌ సిబ్బంది అందరూ సకాలంలో హాజరుకావాలని అధికారులు సూచించారు.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo