ఆదివారం 07 జూన్ 2020
Telangana - Mar 31, 2020 , 22:23:57

సోషల్‌ మీడియాలో ‘చీరకట్టు’చాలెంజ్‌..!

సోషల్‌ మీడియాలో ‘చీరకట్టు’చాలెంజ్‌..!

హైదరాబాద్ :  ప్రస్తుతం అందరిని కరోనా భయం వెంటాడుతోంది. రోజు రోజుకు కరోనా వ్యాప్తి పెరుగుతుండటం.. ఏ రూపంలో తమను ఆవహిస్తుందోననే ఆలోచనలతో అలజడి చెందుతున్నారు. అటు సోషల్‌ మీడియాలో కూడా కరోనా పోస్టులు భయానకంగానే ఉంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది మహిళలు మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంట. వారిలోని నెగెటివ్‌ ఆలోచనలను రూపుమాపడానికి కొంతమంది సోషల్‌ మీడియాలో  ‘చీరకట్టు’ చాలెంజ్‌ ప్రకటించారు. నెగెటివ్‌ ఆలోచనలతో మానసికంగా కుంగుబాటు చెందడమే కాకుండా..అనారోగ్యానికి దారి తీసే ప్రమాదం ఉంది. అందుకే మహిళల్లో పాజిటివ్‌ వైబ్స్‌ కలిగించేలా వారికి నచ్చిన పద్ధతిని ఎంచుకున్నారు. 

అదే చీరకట్టు. వారికినచ్చిన సారీ ధరించి ఫొటో పోస్ట్‌ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ చాలెంజ్‌కు విపరీత స్పందన వస్తోంది.  మహిళలు చీర ధరించి ఫుల్‌ సోలో ఫొటోలను షేర్‌ చేస్తూ.. వారు మరికొంతమందికి ట్యాగ్‌ చేసి సవాల్‌ స్వీకరించాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. ఇలా మహిళలందరూ చీరకట్టుతో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నారు. కరోనా పోస్టులతో కలవరం చెందేవారికి కూడా ఈ సారీ ఫొటో పోస్టులు కొంత ఉపశమనం కలిగించేలా ఉన్నాయంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. logo