శనివారం 23 జనవరి 2021
Telangana - Dec 31, 2020 , 08:14:23

సార‌స్వత పరి‌షత్తు పరీక్ష ఫీజు గడువు 25

సార‌స్వత పరి‌షత్తు పరీక్ష ఫీజు గడువు 25

హైదరాబాద్‌: తెలం‌గాణ సార‌స్వత పరి‌షత్తు పరీ‌క్షలకు జన‌వరి 25లోపు ఫీజు చెల్లిం‌చా‌లని అధికారులు సూచించారు. ప్రాథ‌మిక, ప్రవేశ, విశా‌రద, పూర్వ ఉత్తర భాగాలు అనే నాలు‌గు ‌స్థా‌యిల్లో ఫిబ్రవరి 13, 14 తేదీల్లో పరీ‌క్షలు ఉంటా‌యని పేర్కొ‌న్నారు. ప్రాథ‌మిక పరీక్ష ఉత్తీ‌ర్ణు‌లైతే పబ్లిక్‌ సర్వీస్‌ కమి‌షన్‌ నిర్వహించే థర్డ్‌ క్లాస్‌ లాంగ్వేజ్‌ టెస్ట్‌ ఉత్తీ‌ర్ణతకు సమా‌నంగా పరి‌గ‌ణించనున్నారు. ప్రవేశ పరీక్ష ఉత్తీ‌ర్ణు‌లైతే సర్వీస్‌ కమి‌షన్‌ నిర్వహించే సెకండ్‌ క్లాస్‌ లాంగ్వేజ్‌ టెస్ట్‌ ఉత్తీ‌ర్ణతతో సమా‌న‌మని వెల్లడించారు. వివ‌రా‌లకు 040–24753724, 9603727234 నంబ‌ర్లలో లేదా అబిడ్స్‌ తిల‌క్‌‌రో‌డ్డు‌లోని సార‌స్వత పరి‌ష‌త్‌తో సంప్రదించా‌లన్నారు.


logo