గురువారం 09 జూలై 2020
Telangana - Jun 27, 2020 , 15:17:36

వర్షాభావాన్ని అధిగమించాలంటే మొక్కలు నాటాలి : మంత్రి జగదీశ్‌రెడ్డి

వర్షాభావాన్ని అధిగమించాలంటే మొక్కలు నాటాలి : మంత్రి జగదీశ్‌రెడ్డి

నల్లగొండ : వర్షాభావ పరిస్థితులను అధిగమించాలంటే మొక్కలు నాటడం ఒక్కటే పరిష్కారం అని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో మంత్రి పాల్గొని మొక్కలు నాటారు. మండలి డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌, ఎంపీ లింగయ్య యాదవ్‌, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ...

సీఎం కేసీఆర్‌ పిలుపునందుకుని ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో, పట్టణాల్లో మొక్కలు నాటే కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతుందన్నారు. సీఎం కేసీఆర్‌ ముందుచూపుతో రాష్ట్రంలో అన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయన్నారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించి హరిత తెలంగాణను సాధించేందుకు ప్రజలు ఉద్యమస్ఫూర్తితో హరితహారంలో పాల్గొనాలన్నారు. 


logo