శనివారం 04 జూలై 2020
Telangana - Jun 17, 2020 , 14:24:46

సంతోష్ బాబు అమరత్వం..వెలకట్టలేనిది

సంతోష్ బాబు అమరత్వం..వెలకట్టలేనిది

హైదరాబాద్ : నిరంతరం దేశ రక్షణ కోసం సరిహద్దులో సాహసం చేసి సమరంలో వీరమరణం పొందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు త్యాగాన్ని.. ఈ దేశం ఎప్పటికీ మరిచిపోలేనిదని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. సూర్యాపేటకు చెందిన తెలంగాణ బిడ్డ సంతోష్ బాబు ఇండో, చైనా సరిహద్దు ఘర్షణలో వీరమరణం పొందడంతో ఆ కుటుంబానికి ఏర్పడిన లోటు తీర్చలేనిదన్నారు. తనయుడు చనిపోయినా...దేశం కోసం ప్రాణం వదిలినందుకు గర్విస్తున్నామన్న వారి తల్లిదండ్రుల దేశభక్తికి సెల్యూట్ చేశారు. వారి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు.


logo