శుక్రవారం 23 అక్టోబర్ 2020
Telangana - Sep 21, 2020 , 12:12:55

నిరుపేదలకు సంజీవని సీఎంఆర్ఎఫ్ : ఎంపీ కవిత

నిరుపేదలకు సంజీవని సీఎంఆర్ఎఫ్ : ఎంపీ కవిత

మహబూబాబాద్ : పేద ప్రజల సంజీవని ముఖ్యమంత్రి సహాయనిధి అని మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. మహబూబాబాద్ లోని తన క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు. అలాగే మహబూబాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా నాయకులు పర్కాల శ్రీనివాస్ రెడ్డి, ముత్యం వెంకన్నగౌడ్, పొన్నాల యుగేందర్, బానోత్ రాము, కొయ్యడి వెంకన్నగౌడ్ తదితరులు పాల్గొన్నారు.logo