మంగళవారం 07 ఏప్రిల్ 2020
Telangana - Mar 19, 2020 , 01:52:56

ఆర్టీసీ బస్సుల్లో శానిటైజర్లు

ఆర్టీసీ బస్సుల్లో శానిటైజర్లు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణలో భాగంగా ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో శానిటైజర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రతి ప్రయాణికుడికి కండక్టర్‌ టికెట్‌తోపాటు శానిటైజర్‌ ఇవ్వనున్నా రు. మంత్రి పువ్వాడ అజయ్‌ ఖమ్మంతోపాటు పలుచోట్ల ఆర్టీసీ బస్సుల్లో శానిటైజర్లను పంపిణీచేశారు. ఆర్టీఏ కార్యాలయాల్లో వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు. అత్యవసర సేవలతోపాటు ఈ నెలాఖరులోపు గడువు ముగిసే లెర్నర్‌ లైసెన్స్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ రెన్యువల్‌, రిజిస్ట్రేషన్‌ సేవలు మాత్రం యథావిధిగా కొనసాగించాలని నిర్ణయించారు.  

ఐఐటీ హైదరాబాద్‌ శానిటైజర్లు

ఐఐటీ హైదరాబాద్‌ మెటీరియల్‌ సైన్స్‌ డిపార్టుమెంట్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ముద్రిక ఖండేల్‌వాల్‌ నేతృత్వంలో కొత్త శానిటైజర్‌ తయారుచేశారు. డాక్టర్‌ శివకల్యాణి ఆధ్వర్యంలో ఈ పరిశోధనలను విజయవంతంచేశారు. logo