మంగళవారం 26 మే 2020
Telangana - May 11, 2020 , 00:50:41

కరెన్సీ నోట్లకు.. స్మార్ట్‌ఫోన్లకూ శానిటైజర్‌

కరెన్సీ నోట్లకు.. స్మార్ట్‌ఫోన్లకూ శానిటైజర్‌

  • అభివృద్ధిచేసిన డీఆర్డీవో హైదరాబాద్‌ ఆర్సీఐ ల్యాబ్‌

హైదరాబాద్‌, నమస్తేతెలంగాణ: కరోనా నేపథ్యంలో చేతులను తరచూ శుభ్రం చేసుకుంటున్నాం. కానీ, మనం అనునిత్యం ఉపయోగించే కరెన్సీనోట్లు, స్మార్ట్‌ఫోన్లు, వంటి ఉపకరణాలను శానిటైజ్‌ చేయడం మాత్రం క్లిష్టమైన సమ స్యే. డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్డీవో) దీనికి చక్కని పరిష్కారం కనుగొన్నది. ఫోన్లు, ఐపాడ్స్‌, ల్యాప్‌టాప్స్‌, కరెన్సీ నోట్లు, కాగితాలు, చెక్కులు, చలాన్లు, పాస్‌బుక్‌లు, పుస్తకాలు తదితరాలను శానిటైజ్‌ చేసేందుకు డీఆర్డీవో హైదరాబాద్‌ ల్యా బ్‌ డిఫెన్స్‌ రీసెర్చ్‌ ఆల్ట్రావయోలెట్‌ శానిటైజర్‌ (డీఆర్‌యూవీఎస్‌)- క్యాబినెట్‌ను అభివృద్ధిచేసినట్టు రక్షణ శాఖ ఆదివారం వెల్లడించింది. క్యాబినెట్‌లో వస్తువులు పెడితే 360 డిగ్రీల్లో యూవీ కిరణాలు ప్రసరించి అవి పూర్తిస్థాయిలో శానిటైజ్‌ (క్రిమి/వైరస్‌ రహి తం) అవుతాయని తెలిపింది. తర్వాత క్యాబినెట్‌ స్లీప్‌మోడ్‌కి వెళ్తుందని పేర్కొన్నది. పరికరం సమీపంలో ఎవరూ ఉండకుండా, ముట్టుకోకుండానే దీన్ని ఆపరేట్‌చేసేలా తీర్చిదిద్దారని వివరించింది. సెన్సార్‌తో పనిచేసే స్విచ్‌లు, ఆటోమెటిక్‌ మెకానిజం వల్ల దీన్ని వినియోగించవ్చని పేర్కొన్నది. ఒక్కో కరెన్సీ నోటును యూవీ కిరణాల సమక్షంలో సూక్ష్మజీవి రహితంచేసేలా నోట్స్‌క్లీన్‌ డివైజ్‌ను కూడా ఆర్సీఐ అభివృద్ధి చేసినట్టు వివరించింది.logo