గురువారం 02 జూలై 2020
Telangana - Jun 07, 2020 , 07:16:57

పోలీస్ ట్రైనింగ్ సెంటర్లలో శానిటైజేషన్

పోలీస్ ట్రైనింగ్ సెంటర్లలో శానిటైజేషన్

హైదరాబాద్: కరోనా సంక్షోభ సమయంలోనూ కానిస్టేబుళ్లకు నిరాటంకంగా శిక్షణ కొనసాగిస్తున్నట్టు ట్రైనింగ్‌ ఐజీ (ఎఫ్‌ఏసీ) వీవీ శ్రీనివాస్‌రావు చెప్పారు. రాష్ట్రంలోని 27 పోలీస్‌ శిక్షణ కళాశాలల్లో 12 వేల మంది సివిల్‌, ఏఆర్‌ కానిస్టేబుళ్లకు శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ట్రైనింగ్‌ కళాశాలల్లోని ఇన్‌డోర్‌, ఔట్‌డోర్‌ ప్రాంగణాలు, క్యాంటీన్లు, తరగతిగదులను వారానికి మూడుసార్లు శానిటైజ్‌ చేస్తున్నట్టు పేర్కొన్నారు. 


logo