గురువారం 16 జూలై 2020
Telangana - Jun 07, 2020 , 01:40:30

శానిటైజేషన్‌ పిల్లర్‌.. కరోనా కిల్లర్‌!

శానిటైజేషన్‌ పిల్లర్‌.. కరోనా కిల్లర్‌!

  • ఆటోమెటిక్‌ సెన్సర్‌తో శరీరం శుభ్రం
  • హైదరాబాదీ వినూత్న ఆవిష్కరణ

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: కరోనా దెబ్బకు ఏదైనా దుకాణం వద్దకు వెళ్తే శానిటైజర్‌ను చేతిలో పోసి రుద్దుకొమ్మంటున్నా రు. మనిషి అవసరం లేకుండా శానిటైజ్‌చేసే పరికరాన్ని తయారుచేశాడో హైదరాబాదీ. నగరానికి చెందిన అయ్యప్ప నాగుబం డి ‘శానిటైజేషన్‌ పిల్లర్‌'ను రూపొం దించారు. ఈ పిల్లర్‌ను షాపుల ముందు ఏర్పాటు చేసుకుంటే సరి. వినియోగదారులు ద్వారం వద్దకు వెళ్లగానే పిల్లర్‌కు ఉండే ఆటోమెటిక్‌ సెన్సర్‌ యాక్టివేట్‌ అయ్యి శానిటైజర్‌ను స్ప్రే చేస్తుంది. తల భాగం, చేతులు, కాళ్ల వద్ద ఒకేసారి స్ప్రే చేసేస్తుంది. 6 ఫీట్ల ఎత్తులో ఉండే ఈ పిల్లర్‌ తయారీకి రెండు నెలలు పట్టిందని అయ్యప్ప తెలిపారు. ఒక్కో పిల్లర్‌ను రూ.21వేలకు అమ్ముతున్నట్టు వెల్లడించారు.


logo