మంగళవారం 14 జూలై 2020
Telangana - Jun 05, 2020 , 17:28:21

పారిశుద్ధ్య నిర్వహణ నిరంతరంగా కొనసాగాలి : సీఎస్‌

పారిశుద్ధ్య నిర్వహణ నిరంతరంగా కొనసాగాలి : సీఎస్‌

సంగారెడ్డి : పారిశుద్ధ్య నిర్వహణ నిరంతర ప్రక్రియగా కొనసాగాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ అన్నారు. సంగారెడ్డి జిల్లాలో పల్లె ప్రగతిలో జరుగుతున్న పనులను, పారిశుద్ధ్య నిర్వహణ, హరితహారం తదితరాలను సీఎస్‌ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కంది మండలం ఎద్దుమైలారం, కొండాపూర్‌ మండలం గుంతపల్లి గ్రామాలను సీఎస్‌ ఆకస్మికంగా సందర్శించారు. 

ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో డంప్‌యార్డు, వైకుంఠధామం, వర్మీ కంపోస్ట్‌ యూనిట్‌, హరితహారంలో నాటిన మొక్కలు, నర్సరీ, పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు. ఈ సందర్భంగా సోమేశ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. పారిశుద్ధ్య పనులు రోజు జరగాలన్నారు. ఎప్పుడు వచ్చినా చూడడానికి గ్రామం బాగా కనిపించాలని పేర్కొన్నారు.
logo