గురువారం 29 అక్టోబర్ 2020
Telangana - Sep 21, 2020 , 11:22:46

పారిశుధ్య పనులు సక్రమంగా నిర్వహించాలి : ఎమ్మెల్యే జోగు రామన్న

పారిశుధ్య పనులు సక్రమంగా నిర్వహించాలి : ఎమ్మెల్యే జోగు రామన్న

ఆదిలాబాద్ : ఎమ్మెల్యే జోగు రామన్న ఈరోజు ఉదయం ఆదిలాబాద్ పట్టణంలోని పలు వార్డుల్లో బైక్ పై తిరుగుతూ పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. పట్టణంలోని పలు వార్డుల్లో మురికి కాలువల పనులతోపాటు రహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయి. మున్సిపల్ వైస్ చైర్మన్ దానితో పాటు అధికారులు సిబ్బందితో కలిసి ఆయన పర్యటించారు. వర్షాలు పడుతున్న నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. వర్షం నీరు రోడ్డు పైకి రాకుండా మురుగు కాలువల్లో చెత్తా చెదారం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.logo