మంగళవారం 14 జూలై 2020
Telangana - Jun 05, 2020 , 12:07:58

చిత్తశుద్ధితో పారిశుద్ధ్య పనులు చేపట్టాలి

చిత్తశుద్ధితో పారిశుద్ధ్య పనులు చేపట్టాలి

జనగామ : జిల్లాలో కొనసాగుతున్న ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం, నియంత్రిత పంటల సాగు కార్యక్రమాల్లో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. పాలకుర్తి మండలంలోని తొర్రూరు, పాలకుర్తి, మంచిప్పులలో పారిశుద్ధ్యం, మురుగు కాలువలను పరిశీలించారు. పాలకుర్తిలో వైకుంఠధామం నిర్మాణ ప్రదేశాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇతర నిర్మాణాలు, పారిశుద్ధ్య నిర్వహణ, పందులను గ్రామాలకు దూరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంటు వ్యాధులు ప్రబల కుండా ప్రజాప్రతినిధులు, అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

మంచిప్పుల గ్రామంలో వైకుంఠధామం, నర్సరీలను మంత్రి ఎర్రబెల్లి పరిశీలించి వైకుంఠధామంలో మొక్కలు నాటారు. నరేగా, పంచాయతీ నిధులతో వైకుంఠధామాలు, పారిశుద్ధ్య కార్యక్రమాలు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే సర్పంచ్ లు, వార్డు సభ్యులు, అధికారులు సమన్వయంతో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కార్యక్రమాల్లో జనగామ జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, కలెక్టర్ నిఖిల, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

           


logo