సోమవారం 06 జూలై 2020
Telangana - Jun 22, 2020 , 21:54:27

గ్రీన్‌ చాలెంజ్‌లో పాల్గొన్న సానియా మీర్జా

గ్రీన్‌ చాలెంజ్‌లో పాల్గొన్న సానియా మీర్జా

హైదరాబాద్: ఏస్ షట్లర్ పీవీ సింధు తనకు విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను భారతీయ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా అంగీకరించి సోమవారం తన నివాసంలో మూడు మొక్కలను నాటారు. గ్రీన్ ఛాలెంజ్‌ను ఎంపీ జే సంతోష్ కుమార్ ప్రారంభించారు. తన ఇంటి ప్రాంగణంలో మూడు మొక్కలు నాటిన సానియా.. భారత మాజీ క్రికెట్ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్, తెలంగాణ ఐటీ కార్యదర్శి జయేష్, షట్లర్ సైనా నెహ్వాల్ కు సవాలు విసిరారు.

తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ఫొటోలను పోస్ట్ చేసిన సానియా మీర్జా “పీవీ సింధు నుంచి హరా హైతో భరా హై.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను అంగీకరించాను. మూడు మొక్కలను నాటిన నేను మూడు చెట్లను నాటాలని అజారుద్దీన్‌, జయేశ్‌ రంజన్‌, సైనా నెహ్వాల్‌కు సవాలు చేస్తున్నాను. ఈ చొరవ తీసుకున్న ఎంపీ సంతోష్‌కు ప్రత్యేక ధన్యవాదాలు” అంటూ ట్విట్టర్లో పోస్టు పెట్టారు .దీనిపై ఎంపీ సంతోష్‌ కుమార్‌ స్పందించి మూడు మొక్కలు నాటి గ్రీన్‌ ఇండియాను కొనసాగించేందుకు మరో ముగ్గురిని నామినేట్ చేసినందుకు థ్యాంక్స్‌ సానియా జీ అని రీట్వీట్‌ చేశారు.logo