శనివారం 15 ఆగస్టు 2020
Telangana - Jul 08, 2020 , 19:27:17

స్నిఫ‌ర్ డాగ్ మృతి.. పోలీసుల నివాళి

స్నిఫ‌ర్ డాగ్ మృతి.. పోలీసుల నివాళి

సంగారెడ్డి : పోలీసు విభాగంలో తొమ్మిదేళ్ల పాటు సేవ‌లందించిన ఓ స్నిఫ‌ర్ డాగ్ మంగ‌ళ‌వారం రాత్రి చ‌నిపోయింది. ఆ శున‌కం మృతిప‌ట్ల సంగారెడ్డి పోలీసులు నివాళుల‌ర్పించారు. జ‌ర్మ‌న్ షిఫ‌ర్డ్ 2011, అక్టోబ‌ర్ 6న జ‌న్మించింది. నేర‌స్తుల‌ను గుర్తించ‌డంలో శిక్ష‌ణ పొందిన త‌ర్వాత ఆ డాగ్ ను పోలీసు విభాగంలోకి తీసుకున్నారు. ఈ తొమ్మిదేళ్ల కాలంలో 30 కేసుల్లో నేర‌స్తులు, దొంగ‌ల‌ను స్నిఫ‌ర్ డాగ్ ప‌ట్టుకుంది. 

స్నిఫ‌ర్ డాగ్ కు నివాళుల‌ర్పించిన వారిలో రిజ‌ర్వ్ ఇన్ స్పెక్ట‌ర్స్ హ‌రిలాల్, డేనియ‌ల్, కృష్ణ, ఆర్ఎస్ఐ హ‌నుమంత రెడ్డి, డాగ్ హ్యాండ్ల‌ర్ యాద‌వ్ రావు, జ‌గ‌దీశ్వ‌ర్, హ‌నుమంతు, అంజ‌య్య ఉన్నారు. 


logo