గురువారం 21 జనవరి 2021
Telangana - Jan 03, 2021 , 18:56:01

జాతీయ రహదారి-65పై ప్రమాద ప్రదేశాల గుర్తింపు

జాతీయ రహదారి-65పై ప్రమాద ప్రదేశాల గుర్తింపు

సంగారెడ్డి : జాతీయ రహదారి-65ను సంగారెడ్డి డీఎస్పీ ఏ.బాలాజీ నేతృత్వంలోని పోలీసుల బృందం ఆదివారం పరిశీలించింది. ఈ సందర్భంగా రహదారిపై తరుచుగా ప్రమాదాలు జరుగుతున్న మూడు ప్రాంతాలను డీఎస్పీ గుర్తించారు. సంగారెడ్డి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పోతిరెడ్డిపల్లి జంక్షన్‌, ఐఐటీ-హైదరాబాద్‌ సమీప ప్రాంతం, కవలంపేట్‌ గ్రామాల్లో ప్రమాదాలు తరుచుగా జరుగుతున్నట్లు గుర్తించారు. దీంతో ఈ మూడు ప్రదేశాల్లో ప్రాథమికంగా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాల్సిందిగా సూచించారు. ఈ ప్రాంతాల్లో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాల నివేదికను అందజేయాల్సిందిగా ఆదేశించారు. అతి త్వరలోనే ఈ ప్రదేశాల్లో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్‌ ఎస్‌ఐ వెంకటరాజ్‌, రూరల్‌ ఎస్‌ఐ సుభాష్‌, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. 

తాజావార్తలు


logo