శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Telangana - Sep 03, 2020 , 18:59:52

సంగారెడ్డి పోలీసుల ర‌క్త‌దానం

సంగారెడ్డి పోలీసుల ర‌క్త‌దానం

సంగారెడ్డి : త‌ల‌సేమియా బాధితుల స‌హాయార్థం సంగారెడ్డి పోలీసులు ర‌క్త‌దానం చేశారు. స్థానిక పోలీసుల స‌హ‌కారంతో ఇండియ‌న్ రెడ్‌క్రాస్ సొసైటీ సంగారెడ్డి విభాగం గురువారం పోలీస్ ఫంక్ష‌న్‌హాల్‌లో ర‌క్త‌దాన శిబిరాన్ని ఏర్పాటు చేసింది. జిల్లా ఎస్పీ ఎస్ చంద్ర‌శేక‌ర్‌రెడ్డి, ఇత‌ర పోలీసు సిబ్బంది ర‌క్త‌దానం చేశారు. 60 యూనిట్ల ర‌క్తం సేక‌రించిన‌ట్లు రెడ్‌క్రాస్‌కు చెందిన డాక్ట‌ర్ అశోక్ తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో ఇన్‌స్పెక్ట‌ర్లు శ్రీ‌నివాస్ నాయుడు, రామ‌కృష్ణారెడ్డి, ఆర్ఐ హ‌రిలాల్ త‌దిత‌రులు పాల్గొన్నారు. 


logo