Telangana
- Jan 23, 2021 , 20:28:02
VIDEOS
నందిగామ పంచాయతీ కార్యదర్శి, ఏపీఎం సస్పెండ్

సంగారెడ్డి : జిల్లాలోని పటాన్చెరు మండలం నందిగామ గ్రామ పంచాయతీ కార్యదర్శి, అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్(ఏపీఎం)ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ జిల్లా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం.హనుమంతరావు శనివారం ఆదేశాలు జారీచేశారు. గ్రామంలో తడి, పొడి చెత్తను వేరు చేయడంలో నిర్లక్ష్యం వహించినందుకుగాను కలెక్టర్ చర్యలకు ఉపక్రమించారు. అదేవిధంగా పటాన్చెరు ఎంపీవోకు షోకాజ్ నోటీసు జారీచేశారు. నందిగామలో నూతనంగా నిర్మించిన రైతు వేదికను ప్రారంభించేందుకు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు శనివారం గ్రామానికి విచ్చేశారు. ఈ సందర్భంగా తడి, పొడి చెత్త ఒకే యార్డ్‌లో ఉండటాన్ని గమనించి అధికారులను హెచ్చరించారు. ఇటువంటి చర్యలను ఉపేక్షించేది లేదన్నారు. మంత్రి హెచ్చరికల నేపథ్యంలో ముగ్గురు అధికారులపై కలెక్టర్ చర్యలకు ఉపక్రమించారు.
తాజావార్తలు
- ‘యూపీఐ’ సేవలకు ట్రూకాలర్ రాంరాం.. సేఫ్టీపైనే ఫోకస్
- చమురు షాక్: ఏడేండ్లలో 459% పెరుగుదల
- ఓలా ఫ్యూచర్ మొబిలిటీ.. 2 సెకన్లకో ఈ-స్కూటర్
- హైదరాబాద్‌లో కాల్పుల కలకలం
- రావణ వాహనంపై ఊరేగిన శ్రీశైలేషుడు..
- స్కూల్ గోడ కూలి.. ఆరుగురు కూలీలు మృతి
- హెబ్బా పటేల్ తలను ‘తెలిసిన వాళ్లు’ ఏదో చేసారబ్బా..!
- ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ అంటే..!
- మహారాష్ట్రలో కొత్తగా 8,477 కరోనా కేసులు.. 22 మరణాలు
- పారితోషికం భారీగా పెంచిన నాని!
MOST READ
TRENDING