శనివారం 28 మార్చి 2020
Telangana - Mar 23, 2020 , 21:33:54

కరాచీ బేకరిని మూయించిన కలెక్టర్..వీడియో

కరాచీ బేకరిని మూయించిన కలెక్టర్..వీడియో

సంగారెడ్డి: కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్రప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో..అన్ని జిల్లాల్లో కలెక్టర్లు దగ్గరుండి ప్రజలెవరూ రోడ్లపైకి రాకుండా పర్యవేక్షిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ప్రజలంతా ఒక్కసారిగా రోడ్లపైకి వస్తుండటతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డి పట్టణకేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా తెరిచి ఉంచిన కరాచీ బేకరిని కలెక్టర్ హనుమంతరావు దగ్గరుండి మూసివేయించారు. ప్రజలెవరూ బయటకు రాకుండా స్వీయనియంత్రణను పాటించి సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. 
logo